: గవర్నర్ తేనీటి విందులో కేసీఆర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్!
71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం విందులో తొలిసారి పాల్గొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథులందరికీ గవర్నర్ దంపతులు సాదరస్వాగతం పలికారు.