: క్యాన్సర్ కణాల్లోంచే నివారణ జన్యువు
ప్రస్తుత కాలంలో మనల్ని వణికించే జబ్బులో ఒకటి క్యాన్సర్. కొన్ని రకాల క్యాన్సర్లు చికిత్సకు ఉపయోగించే మందులను సైతం తట్టుకుని వ్యాప్తి చెందుతుంటాయి. అయితే ఇలా క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిలువరించే ఒక కొత్త రకం జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది క్యాన్సర్ కణాల్లోనే ఉంటుంది. అతి వేగంగా చలించే ఈ రకం జన్యువును గనుక నిలువరించగలిగితే క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ జన్యువును గనుక అణచివేస్తే అది క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకుంటుంది.
'అత్యధిక చలనం కలిగిన సమూహం' (హెచ్‌ఎంజీ)గా పేర్కొనే ఈ జన్యువులు క్యాన్సర్ నివారణలో మాత్రమే కాకుండా మూలకణాలకు ఆ శక్తిని ఇవ్వడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ జన్యువును బలహీనపరచడం ద్వారా క్యాన్సర్ కణాల తీరుతెన్నుల్లో తేడా కనిపించినట్టు చెబుతున్నారు. ఈ పరిశోధన క్యాన్సర్ కణితులకు సంబంధించిన చికిత్సలో నూతన ఆవిష్కారాలకు నాంది అయ్యే అవకాశం ఉందని వైద్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.