: నాకు పునర్జన్మ నిచ్చిన వెంకన్నే రాష్ట్రాన్ని చల్లగా చూస్తారు: చంద్రబాబు
కలియుగదైవం వెంకటేశ్వరస్వామి రాష్ట్రాన్ని చల్లగా చూస్తారని, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని వెంకటేశ్వరస్వామి తనకు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, అలిపిరి వద్ద తనపై దాడి చేసినప్పుడు వెంకన్నే తనను కాపాడారని, పునర్జన్మ ఇచ్చారని, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, నవ్యాంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపే శక్తి మనకు ఉందని అన్నారు. స్వాతంత్ర్య వేడుకలు ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నామని, ఈ ఏడాది తిరుపతిలో నిర్వహించామని, చెప్పారు.గొప్ప వ్యక్తుల పుట్టుకకు ఆంధ్రప్రదేశ్ నిలయమని చెప్పిన చంద్రబాబు, చిత్తూరు జిల్లా ఉద్యమాలకు నాంది, ఎంతో మంది వీరోచితంగా పోరాడారని అన్నారు.