: ఒక్క దాడితో మన బలమేంటో తెలిసొచ్చింది: నరేంద్ర మోదీ


పాకిస్థాన్ ప్రాంతంలో ఒక్కసారి చేసిన లక్షిత దాడులతో ఇండియా సత్తా ఏంటో శత్రు దేశానికి తెలిసి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, త్రివిధ దళాలు చేస్తున్న కృషిని అభినందించారు.

"స్వేచ్ఛా  భారతావని కొనసాగాలంటే, దేశాన్ని రక్షించుకోవడం ఎంతో ముఖ్యమైనది. ప్రపంచానికి మన బలం ఏంటన్న విషయం చూపించేందుకు సర్జికల్ దాడులు సాక్ష్యంగా నిలిచాయి" అన్నారు. భారత సైన్యంలోని ఏ విభాగంలో ఉన్న సైనికుడైనా... ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా జాతి సేవలో నిమగ్నమై ఉన్నారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ నిత్యమూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారత జవాన్లు దేశంలోకి చొరబడుతున్న ముష్కరులు, ఉగ్రవాదులపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

  • Loading...

More Telugu News