: పదవీ త్యాగానికి సిద్ధమైన బ్రిటన్ రాణి ఎలిజబెత్.. పెద్ద కొడుకు ప్రిన్స్ చార్లెస్‌కు పట్టాభిషేకం!


బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పదవీ త్యాగానికి సిద్ధమయ్యారు. తన స్థానంలో పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినట్టు రాజమహల్ వర్గాల భోగట్టా. అయితే ఇందుకోసం మరో మూడేళ్లు పడుతుందని సమాచారం. 21 ఏళ్ల వయసులో రాణిగా పట్టాభిషిక్తురాలైన క్వీన్ ఎలిజబెత్-II వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. మరో మూడేళ్లు అంటే ఆమెకు 95 ఏళ్లు వచ్చాక ప్రిన్స్ చార్లెస్ పూర్తిస్థాయిలో పగ్గాలు స్వీకరించనున్నారు. తాను ఎలా పరిపాలించానో తన తర్వాత పరిపాలన కూడా అలాగే ఉండాలన్నదే రాణి అభిప్రాయమని రాయల్ హౌస్‌హోల్డ్ మాజీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు.

కాగా, ప్రిన్స్ వేల్స్ హ్యారీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో తన తల్లి తరపున  పాల్గొంటున్నారు. ఇటీవల కామన్‌వెల్త్ దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించారు. అంతకుముందు కెనడా సందర్శించారు. పర్షియన్ గల్ఫ్ అయితే ప్రిన్స్‌ను అధికారికంగానే రాజుగా గుర్తించింది.

  • Loading...

More Telugu News