: రామేశ్వరం తీరంలోని పడవపై ‘పాక్’ జెండా..ఆరా తీస్తున్న అధికారులు!
తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం తీరంలోని ఓ పడవపై ‘పాక్’ జెండా ఉండటం కలకలం రేపుతోంది. ఈ విషయమై హోం శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఉస్మాన్ అనే జాలరికి చెందిన పడవపై పాక్ జెండా ఎగురుతుండటం గమనించిన కొందరు జాలర్లు, ఈ విషయమై అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు. పడవపైకి జెండా ఎలా వచ్చిందనే విషయంపైన, ఉస్మాన్ కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే విషయంపైన అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాగా, భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాదులు కుట్ర పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులోని కన్యాకుమారి, రామేశ్వరం, పాంబన తదితర సముద్ర తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ దళాలు ప్రత్యేక గస్తీని చేపట్టాయి.