: రోడ్డు ప్రమాదంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి.. అతివేగమే కారణం!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ కుమారుడు విజయ్‌కుమార్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్‌కుమార్‌తో పాటు ఆయన అత్త సావిత్రి భాయి (78) కూడా ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో విజయ్‌కుమార్ భార్య ఝాన్సీ, మరో యువతి శోభకు తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. విజయ్‌కుమార్ భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.