: కీళ్లనొప్పుల నుండి దీర్ఘకాలిక ఉపశమనం


వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడి విపరీతమైన కీళ్ళ నొప్పులు వేధిస్తుంటాయి. వీటికి సరైన పరిష్కారం లేకుండా ఉండేది. అయితే ఈ సమస్యకు దీర్ఘకాలిక ఉపశమనం కలిగించే విధంగా ఒక కొత్త వైద్యాన్ని కనుగొన్నారు బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. భరించలేని కీళ్ళ నొప్పులనుండి ఉపశమనం కలిగించేందుకు కృత్రిమ కందెనను ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఆర్థ్రరైటిస్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. ప్లూయిట్‌ సప్లిమెంట్‌ విధానం ద్వారా తాత్కాలిక ఊరట కలుగుతోంది. కీళ్లలో ఉండే సైనోవియల్‌ ఫ్లూయిడ్‌కు కృత్రిమ ఫ్లూయిడ్‌ను రూపొందించారు బోస్టన్‌ శాస్త్రవేత్తలు. బయోపాలిమర్‌తో తయారైన ఈ కృత్రిమ ఫ్లూయిడ్‌ను కీళ్లలో ఉండే సైనోవియల్‌ ఫ్లూయిడ్‌కు అదనంగా ఎక్కిస్తారు. ఫలితంగా రోగికి ఉపశమనం కలగడంతోబాటు వ్యాధి వేగం కూడా మందగిస్తుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మార్క్‌గ్రిన్‌ స్టాఫ్‌ అంటున్నారు. ఫ్లూయిడ్‌ సప్లిమెంట్‌ విధానం కన్నా తాము రూపొందించిన ఈ కృత్రిమ ఫ్లూయిడ్‌ కీళ్లలో మెరుగైన కందెనలాగా పనిచేస్తోందని, దీన్ని ఉపయోగించినపుడు రెండు కార్టిలేజ్‌ ఉపరితలాల మధ్య రాపిడి చాలా తక్కువగా ఉందని, ఫలితంగా ఉపరితలాల అరుగుదల తగ్గుతోందని మార్క్‌ గ్రిన్‌స్టాఫ్‌ చెబుతున్నారు. ఇది నిజంగా ఆర్థ్రరైటిస్‌ రోగులకు శుభవార్తే కదా...!

  • Loading...

More Telugu News