: పాకిస్థాన్‌తో మా బంధం స్టీల్‌ కంటే దృఢమైనది, తేనె కంటే తియ్యనైనది: చైనా


 చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల్లో ఒకరు, చైనా పొలిట్‌బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్ ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ రోజు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో ఇస్లామాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ పాక్‌తో త‌మ స్నేహాన్ని మ‌ధురంగా వ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేశారు.

 పాక్‌తో తమ అనుబంధం స్టీల్‌ కంటే దృఢమైనదని, తేనె కంటే తియ్యనైనదని అభివ‌ర్ణించారు. పాక్‌, చైనా ప‌ర‌స్ప‌రం సాయం చేసుకుంటున్నాయ‌ని అన్నారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయ‌ని తెలిపారు. పాక్ అభివృద్ధికి చైనా సాయప‌డుతుంద‌ని అన్నారు. చైనా-పాక్ ల మ‌ధ్య  భారీ స్ధాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జ‌ర‌గ‌నున్నాయి. చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్ ను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News