: పదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు చేయలేని పని చంద్రబాబు చేశారు!: మంత్రి దేవినేని ఉమ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి కేవీపీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ చంద్రబాబు చేసిన పనులను చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే వారికి సన్మానం చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన సంగతిని దేవినేని గుర్తుచేశారు. ఆ పని ముగ్గురు కాంగ్రెస్ అసమర్థ ముఖ్యమంత్రులు చేయలేకపోయారని, పదేళ్ల అధికారాన్ని వృథా చేసుకున్నారని, ఆ పనిని చంద్రబాబు అధికారంలోకి రాగానే చేశారని దేవినేని వ్యాఖ్యానించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ - `ముంపు గ్రామాలను ఖాళీ చేయించి పనులు ప్రారంభిస్తే మీకు వెటకారంగా ఉంది. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు. మీ ఉత్తరాలతో, మీ సన్యాసంతో రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందేం లేదు. మీరు ఢిల్లీకి డబ్బు మూటలు మోశారు. అందుకు జగన్ అవినీతి కేసుల్లో ఏ3 ముద్దాయిగా నిన్ను పెట్టాలి. కాంగ్రెస్‌లో ఉండి ఆ పార్టీ నేతలను వైసీపీకి పంపిస్తున్నావ్ నువ్వు. ఇది ఎంతవరకు కరెక్టు?` అంటూ కేవీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.