: మూడంటే మూడే నెలల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ‘వివేకం’


దక్షిణాది నటుడు అజిత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘వివేకం’ టీజర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మూడు నెలల కిందట యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన ఈ టీజర్ ను ఇప్పటివరకు 1.90 కోట్ల సార్లు వీక్షించగా,5,24,872 వేల లైక్స్ పొందింది. మూడు నెలల్లో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా వివేకం ప్రపంచ రికార్డు సృష్టించినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, ఇంతకాలం యూట్యూబ్ లో ‘మార్వెలిన్ అవెంజర్స్’ టీజర్ మొదటిస్థానంలో ఉంది. ఈ టీజర్ విడుదలైన మూడేళ్లకు 8 కోట్ల వ్యూస్, 5,24,009 లైక్స్ వచ్చాయి. అయితే, ఈ రికార్డును అజిత్ ‘వివేకం’ కేవలం మూడంటే మూడే నెలల్లో అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

  • Loading...

More Telugu News