: ఈ రోజు అమ్మమ్మ/అమ్మ జయంతి: హీరో సుమంత్


హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తుచేసుకున్నారు. ఈ రోజు ఆమె జయంతి అంటూ ఓ ట్వీట్ తో పాటు ఫొటోను పోస్ట్ చేశాడు. ‘నా అమ్మమ్మ/ అమ్మ అన్నపూర్ణ జయంతి ఈరోజు’ అంటూ అమ్మమ్మపై తనకు ఉన్న అవ్యాజమైన ప్రేమను సుమంత్ వ్యక్తం చేశాడు. ఇక, ఈ ఫొటోలో చిన్నారి సుమంత్ పై ఎంతో వాత్సల్యం చూపిస్తున్న అన్నపూర్ణ ఉన్నారు. కాగా, నాడు అన్నపూర్ణ స్టూడియోస్ కు శంకుస్థాపన సందర్భంగా చిన్నారి సుమంత్ తో మొదటి ఇటుకను అన్నపూర్ణ పెట్టిస్తున్న ఓ ఫొటోను నిన్న సుమంత్ పోస్ట్ చేశాడు. కాగా, 1975 ఆగస్టు 13న అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

  • Loading...

More Telugu News