: అమెరికాలో `ఫిదా` రికార్డు.. 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన క్లబ్‌లో ఏడో స్థానం
అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఏడో తెలుగు సినిమాగా `ఫిదా` నిలిచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో విడుదలైన నాలుగో వారంలోనే ఈ సినిమా 2 మిలియన్ మార్క్ చేరుకున్నట్లు వారు తెలిపారు. అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాల్లో ఇప్పటివరకు బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అ ఆ, ఖైదీ నెం. 150, బాహుబలి 2 సినిమాలు నిలిచాయి. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా `ఫిదా` సినిమా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.