: 'మిషన్ ఇంపాజిబుల్ 6' షూటింగ్ లో టామ్ క్రూజ్ కు ప్రమాదం
లండన్ సమీపంలో 'మిషన్ ఇంపాజిబుల్ 6' షూటింగ్ జరుగుతుండగా, చిత్రం హీరో టామ్ క్రూజ్ ప్రమాదానికి గురయ్యాడు. 55 ఏళ్ల ఈ నటుడు కారు చేజింగ్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నవేళ, అదుపు తప్పి ఓ భవంతి గోడను బలంగా ఢీకొన్నాడు. పూర్తి యాక్షన్ చిత్రాలుగా పేరున్న 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ లో గత చిత్రాలు అభిమానులను అమితంగా ఆకర్షించాయి. తాజా చిత్రాన్ని కూడా పూర్తి యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఆయనకు గాయాలు కాగా, చికిత్సను అందించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో 'లైఫ్' నటి రెబెక్కా ఫెర్గ్యూస్, 'మ్యాన్ ఆఫ్ స్టీల్' నటుడు హెన్రీ కావిల్ తదితరులు నటిస్తుండగా, వచ్చే సంవత్సరం ఇది వెండి తెరలను తాకనుంది.