: రానా గురించి రాంగోపాల్ వర్మకు మెసేజ్ పెట్టిన యువతి!


దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'పై ప్రశంసలు కురిపిస్తున్న వారి జాబితాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ, "రెండు తెలుగు రాష్ట్రాలూ ఇప్పుడు రానా గురించే మాట్లాడుకుంటున్నాయి. ఈ చిత్రంతో పాటే విడుదలైన మిగతా రెండు సినిమాల్లోని హీరోల గురించి అందరూ మరచిపోయినట్లుంది. 'బాహుబలి'లో రానా పర్సనాలిటీ గురించి మాట్లాడుకున్నారు. కానీ, 'నేనే రాజు నేనే మంత్రి'లో అతని నటనాకౌశలం గురించి చర్చించుకుంటున్నారు. ఓ గ్రీకు దేవుడి అందం, సూపర్ డూపర్ నటనను మించిన కాంబినేషన్ ఏముంటుంది? నాకో అమ్మాయి మెసేజ్ పెట్టింది. 'నేనే రాజు నేనే మంత్రి'లో రానా 'లై', 'జై...'లకన్నా అద్భుతమని, అతను మ్యాజిక్ చేశాడని చెప్పింది" అని రాంగోపాల్ వర్మ చెప్పాడు.

  • Loading...

More Telugu News