: టాలీవుడ్ కు మంచి మంచి హీరోయిన్లు రాకపోవడానికి కారణం వాళ్లే: శివాజీ రాజా
సినీ పరిశ్రమలో దళారులున్నారని మా అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపాడు. ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, డేట్లు చూసే మేనేజర్లు హీరోయిన్ల అవకాశాలు పాడు చేస్తున్నారని అన్నాడు. అందరూ కాకపోయినా 30 శాతం మంది మేనేజర్లు అలాగే ఉన్నారని చెప్పాడు. వారి వల్ల హీరోయిన్లకు వచ్చే అవకాశాలు రాకుండాపోతున్నాయని చెప్పాడు. సినీ పరిశ్రమలో దళారుల ప్రమేయం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నాడు. వారిని మొత్తం కట్ చేస్తే కానీ పరిస్థితులు చక్కబడవని తెలిపాడు. వారిని కట్ చేసేంతవరకు తెలుగు చిత్రపరిశ్రమకు మంచిమంచి హీరోయిన్ల కొరత వెంటాడుతూనే ఉంటుందని అన్నాడు. వారిలో వారు కుమ్మక్కై హీరోయిన్లను ఖాళీగా ఉంచుతున్నారని, ఇంకొందరు కుమ్మక్కై కొంతమందికి అవకాశాలు కల్పిస్తుంటే, మరికొందరి అవకాశాలను పాడుచేస్తున్నారని చెప్పాడు.