: వ్యభిచారం చేయమని వేధిస్తున్న తల్లి.. పోలీసులనాశ్రయించిన కుమార్తె!


కన్నతల్లి పదానికే కళంకం తెచ్చిందో మహిళ...హైదరాబాదు శివార్లలోని ఘట్‌ కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే...ఘట్ కేసర్ పరిధిలోని ఎన్‌ఎఫ్సీ నగర్‌ లోని భార్యాభర్తల విభేదాల కారణంగా కుమార్తె (17) తో కలిసి ఒక మహిళ ఉంటోంది. ఆమె స్థానికంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమె కుమార్తెను వ్యభిచారం చేయాలంటూ గత కొంత కాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.

దీంతో విసిగిపోయిన కుమార్తె విషయాన్ని తల్లికి వివరించగా.. అతనికి సహకరించాలని ఆమె కూతుర్నే మందలించింది. అతను చెప్పినట్టు వింటే డబ్బులిస్తాడని, జీవితం బాగుంటుందని చెప్పింది. దీంతో యువతి తల్లి చెరనుంచి బయటపడి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. అయినప్పటికీ, తల్లి వేధింపులు మానలేదు. తాను చెప్పినట్టు వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, నువ్వు చెడ్డదానివని అందరికీ చెబుతానని, పలువురితో నీకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తానని బెదిరించసాగింది. దీంతో ఆ యువతి ఇక తాళలేక తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News