: కాపు రిజర్వేషన్ పై నేడు స్పష్టత... కాపు నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. నేడు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో ఆయన విఅజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు మూడు గంటలపాటు జరగనున్న ఈ సమావేశంలో కాపు రిజర్వేషన్ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతోపాటు 2 వేల మందికిపైగా కాపు నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు సమాచారం.