: 79కి చేరిన గోరఖ్ పూర్ మృతుల సంఖ్య... ఆస్పత్రిని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 79కి పెరిగింది. ఆస్పత్రి బకాయిలు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థ వాటిని నిలిపివేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్పత్రిని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు వైద్యులతో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఒక్క ఈ రోజే మరో 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు సీఎం ఇప్పటికే ఆదేశించారు.