: ఈ నెల 21న ‘బల్లి మనిషి’ వస్తాడు జాగ్రత్త... తమ పౌరులను హెచ్చరించిన అమెరికాలోని దక్షిణ కరోలైనా


అభివృద్ధి చెందిన దేశాలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకొచ్చేది అగ్ర‌రాజ్యం అమెరికా. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్ర‌గ‌తి సాధించిన ఆ దేశంలోనూ మూఢ‌న‌మ్మ‌కాలు మాత్రం ఇంకా ఎంతో బ‌లంగానే ఉన్నాయి. ఈ నెల‌ 21న సంభవించే సూర్యగ్రహణం సందర్భంగా ఆ దేశంలోని దక్షిణ కరోలైనా రాష్ట్ర అత్యవసర నిర్వహణ విభాగం (ఎస్సీఈఎండీ) తాజాగా త‌మ‌ పౌరులకు ప‌లు విచిత్ర‌ హెచ్చరికలు జారీ చేసింది. సూర్య గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా ప్రపంచంలో కొన్ని అతీంద్రియ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఆ రోజు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

ఆ రోజున‌ ‘బల్లి మనిషి’ ఎదురుకావచ్చని త‌మ పౌరుల‌కు తెలిపింది. తాము చేస్తోన్న ఈ ప్ర‌క‌ట‌న పౌరుల‌ను ఆటపట్టించడానికి చేస్తున్న ప్రకటన కాదని కూడా హెచ్చ‌రించింది. అంతేకాదు, ఈ రోజున కనిపించే ప్రాంతాల మ్యాప్‌ను కూడా విడుదల చేసి, ప్ర‌ధానంగా లీ, సమ్టర్ కౌంటీ ప్రాంతాల ప్రజలు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. కాగా, 1988లో క్రిస్టోఫర్ డేవిడ్ అనే వ్యక్తి బల్లి మనిషిని చూశాడని అక్క‌డి వారి న‌మ్మ‌కం. అత‌డు విచిత్రంగా ఉన్నాడ‌ని అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయంగా హ‌ల్‌చ‌ల్ చేసింది. సూర్యగ్రహణం రోజున అతడి నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి అంద‌రూ నల్లని టీ షర్టులు ధరించాలనే ఓ వార్త‌ కూడా ఇప్పుడు అక్క‌డ‌ వైర‌ల్‌గా మారింది.     

  • Loading...

More Telugu News