: టెస్టుల్లో తొలి శతకం సాధించిన పాండ్యా!
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ లలో తొలి శతకాన్ని సాధించాడు. శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు మ్యాచ్ లో కేవలం 86 బంతుల్లో పాండ్యా 103 పరుగులు చేశాడు. అంతకుముందు 50 పరుగులు పూర్తి చేయడానికి పాండ్యా 61 బంతులు ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం చెలరేగి పోయిన పాండ్యా, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో యాభై పరుగులను కేవలం 25 బంతుల్లోనే పాండ్యా పూర్తి చేసి శతకం కొట్టాడు. కాగా, మధ్యాహ్న భోజన విరామ సమయానికి భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా (108), ఉమేశ్ యాదవ్ (3) ఉన్నారు.