: మరో రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు మ్యాచ్ లో టీమిండియా ఎనిమిది, తొమ్మిది వికెట్లు కోల్పోయింది. సందకన్ బౌలింగ్ లో మహమ్మద్ షమీ (8) ఔటయ్యాడు. అంతకుముందు, సందకన్ వేసిన బంతిని కొట్టబోయిన కులదీప్ యాదవ్(26) అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజ్ లో పాండ్యా, యూటీ యాదవ్ లు కొనసాగుతున్నారు. టీమిండియా స్కోరు 119.4 ఓవర్లలో 477/9.