: పాక్ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా చైనా ఉప ప్రధాని!
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా చైనా ఉప ప్రధాని వాంగ్ యాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగనున్న 70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ప్రధాని షాహిద్ అబ్బాసీతో కలిసి వాంగ్ పాల్గొననున్నారు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూచన మేరకు వాంగ్ యాంగ్ ఈ వేడుకలకు హాజరవుతున్నట్టు సమాచారం.