: బెజవాడలో అమిత్‌షా పర్యటన ఖరారు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీకి అనుబంధంగా ఉన్న వివిధ విభాగాలకు చెందిన నేతలతో అమిత్ షా భేటీ అవుతారని సమాచారం. కాగా, దక్షిణాది రాష్ట్రాలపై మరింత పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమిత్ షా విజయవాడ పర్యటిస్తున్నారని సమాచారం.  

  • Loading...

More Telugu News