: జగన్ కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: వైసీపీ రాజకీయ కార్యదర్శి రామకృష్ణారెడ్డి
జగన్ కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నికలో తాము గెలుపు కోసమే కాకుండా, మెజారిటీపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. చిన్న స్థాయి నేతలను కొనుగోలు చేస్తున్న టీడీపీ, ప్రజాభిమానాన్ని మాత్రం కొనలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పనులు ప్రారంభించి, దానినే అభివృద్ధి అని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోందంటూ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.