: నా కూతురికి సీటు ఇవ్వలేదని చంద్రబాబుపై అలిగిన మాట వాస్తవమే: ఎస్పీవై రెడ్డి


నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తన కూతురికి సీటు ఇవ్వలేదని చంద్రబాబుపై అలిగిన మాట వాస్తవమేనని టీడీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘తప్పనిసరి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి మద్దతు ఇచ్చాను. ఛాలెంజ్ చేస్తున్నా .. నంద్యాలలో గెలిచే వారే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈ ఉపఎన్నికలో సైకిల్ దూసుకుపోతోంది.. విజయం సాధించడం ఖాయం. నాడు.. జగన్ వైఖరి వల్లే 2014లో వైసీపీ ఓటమి పాలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీదే విజయం. జగన్ సీఎం కాలేడు. శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరకుంటే జగన్ తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టేవాడా?’ అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News