: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు వారి జీతాలు పెంచారా? : రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల వేతనాలను టీఆర్ఎస్ సర్కారు అమాంతం పెంచేసిన అంశాన్ని లేవనెత్తారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు వీరి జీతాలు పెంచారా? అని ఆయన నిలదీశారు. ప్రభుత్వ పక్షపాత ధోరణికి ఈ తీరే నిదర్శనమని, కేసీఆర్ తీరు ‘నచ్చితే నజరానా ఇస్తాం.. లేకుంటే జరిమానా విధిస్తాం’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకూ నెరవేర్చని తెలంగాణ సర్కారు.. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల జీతాలను ఏకంగా మూడురెట్లు పెంచడమేంటని ప్రశ్నించారు.