: కృత్రిమ మేధస్సు ఉ.కొరియా కంటే ప్రమాదకరమన్న ఎలోన్ మస్క్.. మండిపడ్డ ఫేస్ బుక్ సీఈవో
ఎన్ని హెచ్చరికలు వస్తున్నా అణ్వస్త్రాల ప్రయోగాలు చేస్తూ దూసుకెళుతూ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోన్న ఉత్తరకొరియా కంటే కృత్రిమ మేధస్సు మరింత ప్రమాదకరమని టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ అన్నారు. కృతిమ మేధస్సుపై ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు చేసిన ఆయన.. ఇదే అంశంపై తాజాగా మరోసారి స్పందిస్తూ... కృత్రిమ మేధస్సుకు సంబంధించిన భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఫేస్బుక్ సంస్థ తయారుచేసిన రోబోలు సొంత భాషను అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఎలోస్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్పందిస్తూ.. లేనిపోని భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని మండిపడ్డారు.