: తిరుమలలో అలజడి రేపిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ఓ మహిళకు తీవ్రగాయాలు


చేతిలో ఓ క‌ర్ర‌తో మ‌తిస్థిమితం లేని ఓ వ్య‌క్తి తిరుమ‌ల‌లో భ‌క్తుల‌పై దాడి చేసి క‌ల‌క‌లం రేపాడు. అక్క‌డి పీయస్సీ-4 వద్ద ఓ మహిళను క‌ర్ర‌తో చావ‌బాదాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. ఆమె ప్ర‌స్తుతం స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తిరుమల భక్తులతో కిట‌కిట‌లాడుతోంది. శ్రీవారి సన్నిధిలో దాదాపు 200 పైగా వివాహాలు జరగనున్నాయి. వేంక‌టేశ్వ‌రుడి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.    

  • Loading...

More Telugu News