: ఆ మహాదంపతుల కడుపున జన్మించడమే నా అదృష్టం: నటుడు బాలకృష్ణ
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆ మహాదంపతుల కడుపున జన్మించడమే తన అదృష్టమంటూ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ తన తల్లిదండ్రులను స్మరించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాన్ని బాలయ్య పఠించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, నవ్యాంధ్ర అభివృద్ధి కేవలం సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం, హెలికాప్టర్ లో రాజమండ్రికి ఆయన బయలుదేరి వెళ్లారు.