: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, యూసఫ్‌గూడ, మోతీనగర్, బోరబండ, సనత్ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచింది.