: బౌండరీతో ధావన్ సెంచరీ.. సెంచరీ ఛాన్స్ మిస్ అయిన రాహుల్
శ్రీలంక పర్యటనలో టీమిండియా ఓపెనర్ ధావన్ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మరో సెంచరీని ధావన్ సాధించాడు. 107 బంతులను ఎదుర్కొన్న ధావన్ 15 ఫోర్ల సాయంతో శతకాన్ని బాదాడు. శ్రీలంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ బౌండరీతో సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 6వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మరోవైపు ధాటిగా ఆడిన మరో ఓపెనర్ రాహుల్ 135 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 85 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పుష్పకుమార బౌలింగ్ లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ కలసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ ఔట్ అయిన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ధావన్ 109, పుజారా 2 పరుగులతో ఆడుతున్నారు. భారత్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 204 పరుగులు.