: యూపీ ప్రభుత్వాసుపత్రిలో 63కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు రోజుల్లో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికి 63కి చేరింది. ఈ మొత్తం మరణాలు ఐదు రోజుల వ్యవధిలో జరిగాయని తెలిసింది. తమకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుపత్రి రూ.66 లక్షల బాకీ చెల్లించకపోవడంతో.. ఆసుపత్రికి ఆ సంస్థ ఆక్సిజన్ పంపిణీని నిలిపివేసింది. ఆ రాష్ట్ర సీఎం ఆదిత్య నాథ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, మానవతా దృక్పథంతో ఈ రోజు ఆ ఆసుపత్రికి ఓ ప్రైవేటు సంస్థ 200 ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసింది.