: అవన్నీ తప్పుడు వార్తలు: వన్డేలకు తనకు విశ్రాంతి ఇవ్వనున్నారన్న వార్తలపై కోహ్లీ


శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ లో కెప్టెన్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ తో పాటు పలు సిరీస్ లను వరుసగా ఆడిన నేపథ్యంలో, వీరికి విశ్రాంతిని ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కోహ్లీ స్పందించాడు. అవన్నీ తప్పుడు వార్తలని... వన్డేలలో తాను ఆడటం లేదని ఎవరు చెప్పారంటూ ఆయన ఎదురు ప్రశ్నించాడు.

ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు అర్థం కావడం లేదని... వన్డేల్లో ఆడటానికి తనకు ఎలాంటి సమస్యలు లేవని అన్నాడు. ఆగస్ట్ 13న జట్టు ఎంపిక ఉంటుందని... త్వరలోనే టీమ్ మేనేజ్ మెంట్, సెలక్టర్లు, తాను సమావేశమై జట్టు కూర్పు, ప్రణాళికల గురించి చర్చిస్తామని చెప్పాడు. జట్టు కెప్టెన్ గా ఆ సమావేశంలో తన ఆలోచనలు వెల్లడిస్తానని తెలిపాడు.

  • Loading...

More Telugu News