: మరో అడుగేసిన చైనా... పరిమిత సైనిక చర్యకు గ్రీన్ సిగ్నల్?


డోక్లామ్ ప్రాంతంలోని భారత సైన్యాన్ని ఎలాగైనా తరిమేయాలని నిర్ణయించుకున్న చైనా ప్రభుత్వం తమ సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా పలు మార్లు హెచ్చరికలు పంపినా, ఇండియా వినట్లేదని ఆరోపిస్తూ, పరిమితంగా సైనిక చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతంలో మోహరించిన తమ జవాన్లకు చైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.

బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలూ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో, తొలుత భారీ ఆయుధాలు వాడకుండా భారత జవాన్లను తరిమేసే పనులు మొదలు పెట్టాలని రక్షణ శాఖ నుంచి ఆర్డర్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. భూటాన్ విదేశాంగ మంత్రితో సుష్మా స్వరాజ్ భేటీ అయిన వేళ, చైనా నుంచి ఈ తరహా ఆదేశాలు రావడం గమనార్హం. చైనా ఇచ్చిన తాజా ఆదేశాలపై భారత్ ఇంకా స్పందించాల్సి వుంది.

  • Loading...

More Telugu News