: కాబూల్ మసీదులో గర్జించిన తుపాకి.. నలుగురి దుర్మరణం
కాబూల్‌లోని ఉత్తర టఖార్ ప్రావిన్స్‌లోని ఓ మసీదు రక్తసిక్తమైంది. అందులోకి చొరబడిన సాయుధ దుండగుడు ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపాడు. నలుగురు దుర్మరణం పాలవగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు స్థానిక వార్‌లార్డ్ మిలీషియా గ్రూప్ సభ్యుడని ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ జనరల్ ఫాఖిర్ మొహమ్మద్ తెలిపారు. మసీదు పెద్ద మాల్వి మాఫుజ్‌తో వార్‌లార్డ్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడి నుంచి మాల్వి సురక్షితంగా తప్పించుకున్నారు.