: ఈ విమానానికి ఇంధనం సూర్యుడే!


సౌరశక్తితో నడిచే విమానాన్ని తయారు చేసిన అమెరికా దానిపై ప్రపంచ యాత్ర సాగిస్తోంది. పూర్తిగా సౌరశక్తితో నడిచే ఈ విమానం పేరు 'సోలార్‌ ఇంపల్స్‌'. సూర్యుడి కాంతితో పగలూ, రాత్రీ కూడా ఇది ప్రయాణం చేయగలదు. అమెరికా చేపట్టిన ఈ యాత్రలో భాగంగా శుక్రవారం నాడు కాలిఫోర్నియా నుండి బయలుదేరిన సోలార్‌ ఇంపల్స్‌ శనివారం నాడు అరిజోనా చేరింది.

ప్రజలకు మన చుట్టూ వున్న ప్రకృతి వనరులును ఉపయోగించుకుని లభ్ది పొందడం గురించి, ఇంకా ఇంధన వనరుల పొదుపు గురించి అవగాహన కలిగించడానికి ఈ యాత్ర చేపట్టినట్టు ఈ విమాన సహ పైలెట్‌ వివరిస్తున్నారు. అంతేకాదు రానున్న తరాల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆసక్తి, అవగాహన కలిగించడం కూడా ఈ యాత్రలో భాగమని అంటున్నారు. నిజమేకదా... సూర్యుడు మనకు లభించే తరగని శక్తి వనరు. సౌరశక్తి వినియోగంపై కూడా ఇటీవల ప్రజలకు అవగాహన పెరుగుతోంది కూడా...!

  • Loading...

More Telugu News