: నేటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్!


నేటి నుంచి బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూత పడనున్నాయి. దీని ప్రభావంతో చెక్ క్లియరెన్సులు నిలిచిపోనుండగా, ఏటీఎంలలో నగదు నిండుకుంటే, తిరిగి వాటిని నింపే వీలుండదు. నేడు రెండో శనివారం కాగా, రేపు ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఆపై సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి, మంగళవారం నాడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు వరుస సెలవులూ కలిపి మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఇక, ఇదే నెలలో మరోసారి మూడు వరుస సెలవులు రానున్నాయి. 25వ తేదీ శుక్రవారం వినాయక చవితి, శనివారం నాడు నాలుగో శనివారం, ఆపై ఆదివారం కలుపుకుని మూడు వరుస సెలవులు వస్తాయి.

  • Loading...

More Telugu News