: ఆక్సిజన్ అందకే 30 మంది చిన్నారుల మృతి... వెంటిలేటర్ పై మరో 45 మంది చిన్నారులు
మెదడువాపు వ్యాధితో బాధపడుతూ ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్‌లోని బీడీఎస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల్లో 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకే వారంతా చనిపోయినట్లు తెలిసింది. తమకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుపత్రి రూ.66 లక్షల బాకీ ఉంది. ఆ బిల్లు చెల్లించడంలో జాప్యం చేస్తుండడంతో ఆ కంపెనీ ఆసుపత్రికి ఆక్సిజన్ పంపిణీని నిలిపివేసింది.
ఈ కారణంగానే ఏకంగా 30 మంది అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాతపడ్డారు. అంతేగాక, అదే ఆసుపత్రిలో మరో 45 మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని సమాచారం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజక వర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.