: నేటి నుంచి ‘జెట్ ఎయిర్ వేస్’ ఇండిపెండెన్స్ డే సేల్


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఇండిపెండెన్స్ డే సేల్ ను నేటి నుంచి ప్రారంభించింది. తన నెట్ వర్క్ పరిధిలోని 44 దేశీయ గమ్యస్థానాలకు, 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఈ రాయితీలు వర్తించనున్నట్టు ప్రకటించింది. ఎకానమీ, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలపై వరుసగా 30, 20 శాతం రాయితీ ప్రకటించింది.

డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి సెప్టెంబరు 5 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు సెప్టెంబరు 15 వరకు ఈ ఆఫర్ ను వర్తింపజేసింది. ఈ సందర్భంగా జెట్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ షణ్ముగన్ మాట్లాడుతూ, 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్ ద్వారా టిక్కెట్లు విక్రయించడాన్ని గొప్పగా భావిస్తున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News