: మదరసాలలో ఆగస్టు 15 వేడుకలు.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ మదరసా కమిటీ!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుక వస్తోన్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల చేసిన సూచనను ఆ రాష్ట్ర మదరసా కమిటీ అంగీకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే మంగళవారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ఆ రోజున తమ రాష్ట్రంలోని అన్ని మదరసాల్లో జెండా ఆవిష్కరణతోపాటు జాతీయ గీతం ఆలపించాలని పేర్కొంటూ మదరసా శిక్ష పరిషత్ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల మదరసాలు ఉన్నాయి. ఆగస్టు 15న ఉదయం 8 గంటలకు ఆ రాష్ట్రంలోని అన్ని మదరసాలలో జాతీయ జెండాను ఎగరవేయనున్నారు.