: రూ.100 కోట్ల క్లబ్ లో కమల్ 'విశ్వరూపం'


కాస్త లేటుగా వచ్చినా.. కమల్ హాసన్ 'విశ్వరూపం' లేటెస్ట్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని అవాంతరాలను అధిగమించి.. ఫిబ్రవరి 7న తమిళనాట కూడా విడుదలైంది. కాగా, ఈ భారీ చిత్రం ఇప్పటి వరకు రూ. 120 కోట్లు వసూలు చేసిందట. ఈ సినిమాలో విలన్ గా నటించిన రాహుల్ బోస్ ఈ విషయాన్ని పేర్కొంటూ, ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

'విశ్వరూపం 120 కోట్లు వసూలు చేసినట్టు ఇప్పుడే తెలిసింది. రూ.100 కోట్లు పైన వసూలు చేసిన సినిమాలో నేనూ భాగస్వామిని కావడం ఇదే తొలిసారి. చిత్ర బృందానికి.. ముఖ్యంగా కమల్ కు నా కృతజ్ఞతలు' అంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు.

వాస్తవానికి 'విశ్వరూపం' జనవరి 24న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ముస్లిం సంఘాలు ఆందోళన లేవనెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం సినిమాపై నిషేధం విధించింది. కొన్ని సీన్లను తొలగించేందుకు కమల్ అంగీకరించడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. రూ. 96 కోట్ల భారీ బడ్జెట్ తో కమల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News