: ఢిల్లీకి మారిన తమిళ రాజకీయం... మోదీతో మాట్లాడనున్న పన్నీర్ సెల్వం
దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న తమిళ రాజకీయం హస్తినకు చేరింది. నిన్న అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలైన ఓ పన్నీర్ సెల్వం, ఈ పళనిస్వామి వర్గాలు ఒకటై, చిన్నమ్మ శశికళ, ఆమె బంధువు టీటీవీ దినకరన్ కు చెక్ పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ ఎన్డీయే మార్క్ ఉండాలని భావిస్తున్న బీజేపీ, ఈ రెండు వర్గాల కలయికకూ మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది.
ఇక ఎన్డీయేలో చేరితే, పన్నీర్ సెల్వంకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో, ఆయన నేడు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పన్నీర్ ప్రత్యేకంగా భేటీ కానుండటంతో, అన్నాడీఎంకే కచ్చితంగా ఎన్డీయే గొడుగు కిందకు చేరనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.