: బెలూచిస్థాన్ అండర్ గ్రౌండ్ లో పాక్ అణ్వాయుధాలు: యూఎస్ సంస్థ కీలక నివేదిక


బెలూచిస్థాన్ లోని ఓ ప్రాంతంలో పాకిస్థాన్ అత్యంత పటిష్ఠమైన భూగర్భ స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడే శక్తిమంతమైన అణ్వాయుధాలను దాచిందని ఓ అమెరికన్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. 'ది ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ' అనే సంస్థ శాటిలైట్ ఫోటోలతో ఇన్వెస్టిగేషన్ చేసి, ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇక్కడ ఖండాంతర క్షిపణులతో పాటు అణు వార్ హెడ్ లను సైతం పాక్ దాచిందని నివేదికను రూపొందించిన డేవిడ్ అల్ బ్రైట్ం సారా బుర్క్ హార్డ్, అలీసన్ లాచ్, ఫ్రాంక్ పాబియన్ వెల్లడించారు. తన వ్యూహాత్మక అవసరాల నిమిత్తం పాక్ బెలూచ్ ప్రావిన్స్ లో ఓ అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోందని పేర్కొంది. చుట్టూ పర్వత ప్రాంతాలు, దేశం మధ్యలో ఉండటం ఈ ప్రాంతాన్ని అణ్వాయుధాలకు సురక్షితంగా మార్చాయని నివేదిక అభిప్రాయపడింది. భూ గర్భంలోకి ఈ ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లవచ్చని, ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలు, రక్షణ వ్యవస్థలూ ఉన్నాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News