: వెంకయ్యను స్వర్గం నుంచి జయలలిత ఆశీర్వదిస్తున్నారు: తమిళ ఎంపీ నవనీతకృష్ణన్


వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభ అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన వేళ, తనలోని ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెలియజేస్తూ అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్ మాట్లాడారు. వెంకయ్య తమిళనాడుకు చెందిన వ్యక్తని చెప్పారు. "గౌరవనీయ అధ్యక్షులు గౌరవనీయ అమ్మకు ఎంతో కావాలసిన వారు" అనడంతో సభంతా నవ్వులతో నిండిపోయింది. అమ్మ బతికుంటే వెంకయ్య ఈ పదవికి రావడంపై అందరికన్నా ఎక్కువగా ఆనందించి వుండేవారని, ఆమె ఇప్పుడు స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు.

 ఇండియాలోని అన్ని ప్రాంతాలనూ ఎన్నోమార్లు పర్యటించిన అనుభవం ఆయనకు సొంతమని, తనకు సంబంధించినంత వరకూ వెంకయ్య తమిళనాడుకు చెందిన వ్యక్తేనని, ఆయన ఉమ్మడి తమిళనాడులో జన్మించిన వ్యక్తని అన్నారు. సభలోని ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండే ఆయన సభను సమర్థవంతంగా నడిపించడంలో విజయం సాధిస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు.

  • Loading...

More Telugu News