: కరాచీలోనే నిక్షేపంగా దావూద్... సీఎన్ఎన్ ఎడిటర్ ఫోన్ చేస్తే స్వయంగా లిఫ్ట్ చేసిన డాన్!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం బాగాలేదని, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడని వచ్చిన వార్తలు నిజం కావని తేలిపోయింది. ఆయన నిక్షేపంగా కరాచీలోనే ఉన్నట్టు సీఎన్ఎన్ న్యూస్-18 వెల్లడించింది. సదరు న్యూస్ చానల్ కు చెందిన ఇన్వెస్టిగేషన్స్ విభాగం ఎడిటర్ మనోజ్ గుప్తా, దావూద్ ఇంటికి ఫోన్ చేయగా, స్వయంగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేశాడట. తనను పరిచయం చేసుకున్న తరువాత తాను జావేద్ చోటానీనని, దావూద్ ఇబ్రహీం దుబాయ్ లో వ్యాపారాలు చూసుకుంటున్నాడని చెప్పాడట. ఆపై చోటానీని పిలిపించి మాట్లాడించాడట.
ఆ సమయంలో పక్కనే ఉన్న దావూద్ ఏం మాట్లాడాలన్న విషయాన్ని చోటానీకి స్వయంగా వివరిస్తున్నట్టు తనకు తెలిసిందని మనోజ్ గుప్తా వెల్లడించారు. ఇక మీరు కరాచీలోనే ఉన్నారన్న మాట అనగానే, ఎవరు చెప్పారని చోటానీ ప్రశ్నించాడని, సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చాడని, ఫోన్ చేస్తే దావూద్ సాహెబ్ లిఫ్ట్ చేస్తారని, ఇంటర్వ్యూ చేసేయవచ్చని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డాడని గుప్తా పేర్కొన్నారు.