: మోదీని కలిసిన రెబల్ స్టార్... కృష్ణంరాజుకు గవర్నర్ పదవి?


రెబల్ స్టార్ కృష్ణంరాజు, తన సతీమణితో కలసి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ దంపతులు మోదీని కలిశారు. నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనుండగా, ఆ తరువాత నూతన గవర్నర్ల నియామకం ఉంటుందని వార్తలు వస్తున్న నడుమ కృష్ణంరాజు దంపతులు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వేళ, దక్షిణాదిలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు మరింత మందికి పదవులు ఇవ్వాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇచ్చే విషయమై ఊగాగానాలు గతంలోనే వచ్చాయి. కాగా, తాము మర్యాద పూర్వకంగానే మోదీని కలిశామని, రాజకీయాలేమీ మాట్లాడలేదని మోదీతో భేటీ అనంతరం కృష్ణంరాజు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News