: పెళ్లయిన రెండు నెలలకే బాంబు దాడి కేసులో జైలుకెళ్లిన హైదరాబాద్ యువకుడు.. వేరొకరిని వివాహం చేసుకోమని భార్యకు సలహా!


ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు బాంబు దాడి కేసులో జైలుకు వెళ్లాడు. గత 12 ఏళ్లుగా జైలులో గడుపుతున్నాడు. అండర్‌ట్రయల్ ఖైదీగా మారడంతో ఇక బయటకు వచ్చే మార్గం లేదని భావించిన ఆ యువకుడు తన భార్యను వేరే వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. ఇది సినిమా కథ కాదు.. హైదరాబాద్‌లో పన్నెండేళ్ల క్రితం అరెస్టయిన కలీం వ్యథ.

హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన కలీం (35) వృత్తి రీత్యా వెల్డర్. 2005లో టాస్క్‌ఫోర్స్ బాంబ్ పేలుడు కేసులో కలీం అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందు అయేషా (పేరు మార్చాం)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 23 ఏళ్ల వయసులో అరెస్టయిన కలీం వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. బంగ్లాదేశ్ వెళ్లిన కలీం అక్కడ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ సభ్యులతో కలిసి  హైదరాబాద్‌లో బాంబు పేలుడుకు పథకం రచించాడన్నది అతడిపై నమోదైన అభియోగం.

కలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని నానా రకాలుగా టార్చర్ పెట్టారు. పోలీసుల దెబ్బకు కాళ్లు దెబ్బతిన్నాయి. సరిగా నడవలేకపోతున్నాడు. పెళ్లి ముచ్చట తీరకుండానే జైలుకు వెళ్లిన కలీం పుష్కర కాలంగా అక్కడే గడుపుతున్నాడు. అండర్ ట్రయల్‌గా మారడంతో ఇక తాను బయటకు వచ్చే అవకాశం లేదని భావించిన కలీం.. మరో పెళ్లి చేసుకోవాల్సిందిగా భార్య అయేషాకు సూచించినట్టు కలీం కజిన్ అస్లాం కన్నీటి పర్యంతమవుతూ పేర్కొన్నారు. పెళ్లయినా ఆ సంతోషాన్ని కలీం ఎక్కువ కాలం అనుభవించలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News