: పెళ్లికని హెలికాప్టర్‌లో బయలుదేరారు... నేరుగా జైలులో దిగారు!


పెళ్లి వేడుక‌కు హెలికాఫ్ట‌ర్‌లో బ‌య‌లుదేరిన ఓ కుటుంబం నేరుగా జైలులోకి వెళ్లిపోయింది. పైల‌ట్ చేసిన త‌ప్పిదం కారణంగా ఆ హెలికాప్ట‌ర్ జైలులో ల్యాండ్ కావ‌డంతో ఆ కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. జైలులోకి హెలికాప్టర్‌ రాగానే అక్క‌డి భద్రతా సిబ్బంది అంతా ఆ హెలికాప్ట‌ర్‌ని చుట్టుముట్టి అందులో ఉన్నవారిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. బంగ్లాదేశ్‌లోని కాశింపూర్‌ ప్రాంతంలో ఉన్న సెంట్రల్‌ జైలులో జ‌రిగిన‌ ఈ ఘటనపై అక్క‌డి అధికారులు మాట్లాడుతూ... పైలట్‌ పొరపాటున కాశింపూర్‌ సెంట్రల్‌ జైలులో ఆ హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశాడని తెలిపారు.

హెలికాప్ట‌ర్‌లో ఉన్న ఐదుగురు ప్రయాణికులను, పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారించి అస‌లు విషయాన్ని తెలుసుకుని వ‌దిలిపెట్టిన‌ట్లు చెప్పారు. ఆ జైలులో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని, వారిని తప్పించేందుకు దాడులు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయని, దీంతో తాము మొద‌ట ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న‌వారిని అదుపులోకి తీసుకుని, ఆ త‌రువాత వ‌దిలేశామ‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News