: ఆయనతో కలిసి నటించాలంటే కొంచెం టెన్షన్ గా ఉందంటున్న రానా!
రానా, కాజల్ నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా పాల్గొన్న ఓ ప్రచార కార్యక్రమంలో పలు విషయాలను చెప్పాడు. తన బాబాయి విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటించేందుకు తనకు కాస్త టెన్షన్‌గా ఉందని అన్నాడు. తామిద్దరం కలిసి నటించేందుకు సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నామని అన్నాడు.
సరైన కథ దొరికితే వీలైనంత త్వరలోనే తాను వెంకటేశ్‌తో కలిసి నటిస్తానని చెప్పాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను దర్శకుడు తేజ రూపొందించాడు. బాహుబలిలో పవర్ ఫుల్ పాత్రలో నటించిన అనంతరం రానా నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పంచెకట్టి, రానా చెబుతున్న డైలాగులను ట్రైలర్ లో చూపించారు.